డెలివరీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)


1. మీరు డెలివరీ ఇచ్చే ప్రాంతం ఏంటి?


మేము అనంతపురం పట్టణం నుండి 40 కిలోమీటర్ల పరిధి లోపల మాత్రమే డెలివరీ ఇస్తాము. మా వెబ్‌సైట్ www.agrosree.com లో ఉన్న మ్యాప్‌ చూసి మీరు పరిధిలో ఉన్నారా తెలుసుకోవచ్చు. లేదా మా whatsApp number 9849466397ను chat ద్వారా లేదా phone ద్వారా అయినా  సంప్రదించి అడగవచ్చును. 


2. మీ అన్ని ఉత్పత్తులకు హోమ్ డెలివరీ ఉంటుందా?


అవును, మా వెబ్‌సైట్‌లో చూపిన అన్ని ఉత్పత్తులకు హోమ్ డెలివరీ అందుబాటులో ఉంటుంది. మీ గ్రామం మా పరిధిలో ఉందా తెలియకుంటే, వెంటనే WhatsApp ద్వారా సంప్రదించండి! 


3. డెలివరీకి ఎంత టైమ్ పడుతుంది?


సాధారణంగా ఉదయం 9 గంటల నుచి సాయంత్రం 5 గంటల  సమయాల్లో order పెట్టిన 4 నుండి 6 గంటల లోపు  మీ ఆర్డర్ డెలివరీ అవుతుంది. (మీ గ్రామం దూరాన్ని బట్టి)


4. నేను నా గ్రామం eligible area లో ఉందా అని ఎలా తెలుసుకోగలను?


మా డెలివరీ పేజీలో ఉన్న మ్యాప్‌ను చూడండి. లేదా మీ గ్రామం పేరు మాకు WhatsApp చేయండి – మేమే చెప్తాము.


5. డెలివరీ ఛార్జ్ ఉంటుందా?

₹1000 కంటే ఎక్కువ ఆర్డర్ లకు డెలివరీ ఉచితం. ₹1000 కంటే తక్కువ ఆర్డర్‌కి ₹50 – ₹100 వరకు delivery charge ఉంటుంది.


6. డెలివరీ తర్వాత చెల్లించగలనా?


అవును, Cash on Delivery (COD) కొన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంది. దూర ప్రాంతాలకు ముందే పేమెంట్ చేయాలి.


7. డెలివరీ ఆలస్యం అయితే ఏమి చేయాలి?


మీ ఆర్డర్ ఆలస్యం అయితే, మీరు మమ్మల్ని WhatsApp లేదా కాల్ చేయండి. మేము వెంటనే స్పందిస్తాం.

సంప్రదించండి:


WhatsApp: https://wa.me/919849466397